మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామంలో బుధవారం ఐకేపి వరి కొనుగోలు సెంటర్ ను ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు చూడాలని కోరారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు.