తాండూరు: సర్వే సర్వం మోసం: జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కుల సర్వేను కోతల గణన, క్యాస్ట్ సెన్సెక్స్ కాదు కటింగ్ సెన్సెక్స్ గా ఉందని వికారాబాద్ జిల్లా తాండూరు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్ అభివర్ణించారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సర్వేలో కులానికి సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉండగా రాజకీయం, ఆస్తులు, అప్పులు, సంతానం, చదువు వంటి అంశాలను సేకరించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.