దుద్యాల మండలం చిల్ములమైలారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఛైర్మన్ జయకృష్ణ, తహశీల్దార్ కిషన్ నాయక్ ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధాన్యం కొన్న 48 గంటల్లో రైతు అకౌంట్లో డబ్బు జమ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ ఛైర్మన్ వెంకట్ రాములు గౌడ్, ఈఓ, తదితరులు పాల్గొన్నారు.