వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండల మహిళా సమైక్య 24వ వార్షిక మహాసభ సమావేశం శనివారం మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అనిత అధ్యక్షతన నిర్వహించారు. ఏపీఎం సత్తయ్య మాట్లాడుతూ.. మహిళా సమైక్య ద్వారా విద్యార్థులకు ఏకరూప దుస్తులను కుట్టించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి అంబుజా, కోశాధికారి భాగ్యమ్మ, ఉపాధ్యక్షురాలు రాములమ్మ, సీసీలు సునీత, అంజమ్మ, అజీజ్, అకౌంటెంట్ సునీత, ఆపరేటర్ సురేశ్ బాబు ఉన్నారు.