2024 సాధారణ ఎన్నికల్లో సీట్లు తక్కువ రావడంతో జమిలీ ఎన్నికలపై BJP మాట్లాడలేదని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. హరియాణాలో గెలిచాక మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ఆరాటపడడం, లేకపోతే ఎక్కువ చోట్ల ప్రచారానికి వీలుగా ఝార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించి ఎన్నికలు నిర్వహించడం తగదన్నారు.