పానీ పూరీ (గప్‌చుప్) అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ వీడియోలో పానీ పూరీ పిండి కలుపుతున్న విధానం చూస్తే మాత్రం ఇక వాటి జోలికి వెళ్లరు. ఇద్దరు వ్యక్తులు కాళ్లతో తొక్కుతూ పిండిని సిద్ధం చేస్తున్నారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో చోటు చేసుకుంది. కాగా ఈ నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పిండిలో రుచి కోసం టాయిలెట్ క్లీనర్ హార్పిక్ తో పాటు యూరియా కలుపుతున్నట్లు నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు.