తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని డిసైడ్ అయిన ప్రభుత్వం.. మంగళవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫామ్‌ను రిలీజ్ చేసింది. కుటుంబ యజమాని కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు చేసుకోనున్నారు. ప్రతి కుటుంబం యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులానికి సంబంధించిన వివరాలు సేకరించనున్నారు. భూములు, రిజర్వేషన్లు, రాజకీయ నేపథ్య వివరాలను సైతం అధికారులు అడిగి తెలుసుకోనున్నారు. నవంబర్ 6 నుండి సర్వే మొదలు కానుంది.