కోదాడ ప్రభుత్వ వైద్యశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. బాలింతలతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం వస్తున్న రోగులను ఇబ్బందులు పెట్టకుండా సత్వరమే నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూపరిన్ డెంట్ డాక్టర్ దశరథ వైద్యులు ఉన్నారు.