భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 100 సంవత్సరాలలోకి అడుగిడుతున్న సందర్భంగా డిసెంబర్ 30న నల్లగొండలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. గురువారం కోదాడలో పార్టీ కార్యాలయంలో బహిరంగ సభ కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఎస్ కే లతీఫ్, నాయకులు వెంకట నారాయణ ఉన్నారు.