కోదాడ మండలం తమ్మరలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ కోదాడ పిఏసి ఎస్ ఛైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లను పెంచాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, ఏఓ రజిని ఉన్నారు.