డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆర్థిక, సామాజిక, కులగణన వివరాలను ఆన్ లైన్ లో ఏకాగ్రతతో నమోదు చేయాలని హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. బుధవారం హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వే వివరాలన్నీ సమగ్రంగా కంప్యూటర్ లో నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నాగార్జున రెడ్డి, మున్సిపల్ అధికారులు ఉన్నారు.