దేశంలో త్యాగాల చరిత్ర కమ్యూనిస్టులదని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల వేడుక కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు దేవరం మల్లేశ్వరి, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ గిన్నె వెంకట్ రెడ్డి, నాయకులు జడ శ్రీనివాస్ ఉన్నారు.