కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మిక, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 26వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐఎన్టీయుసీ హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య, ప్రధాన కార్యదర్శి గుంటిక కరుణాకర్ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కర పత్రాలను ఆవిష్కరించారు.