రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఆదేశించారు. పెద్దపల్లి పట్టణంలోని వార్డుల్లో ఎన్యూమరేటర్లు చేస్తున్న సర్వేను శనివారం కమిషనర్ పరిశీలించారు. ఒక్క కుటుంబం కూడా మిస్సవ్వకుండా నమోదు చేయాలన్నారు. అలాగే నమోదు చేసిన ఇంటికి తప్పకుండా సర్వే స్టికర్లు అంటించాలన్నారు.