పెద్దపల్లి: రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించేలా చర్యలు
రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని ట్రెస్సా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా రెవెన్యూ సిబ్బంది వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్ పై జరిగిన దాడిపై నిరసన తెలిపారు. అదనపు కలెక్టర్ వేణు, రెవెన్యూ సిబ్బంది నిరసనలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.