రేపే సద్దుల బతుకమ్మ.. పూలకు భారీగా డిమాండ్
సద్దుల బతుకమ్మ సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద పూల కొనుగోళ్లతో సందడి వాతావరణం నెలకొంది. పట్టణ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు వివిధ రకాల పూలు తీసుకురావడంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. గురువారం బతుకమ్మ ఆఖరి రోజు కావడంతో పూలకు భారీగా డిమాండ్ పెరిగింది. సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకునేందుకు ఆడపడుచులు సిద్ధం అవుతున్నారు. పిండి వంటలు, సత్తు పిండి సిద్ధం చేసుకుంటున్నారు.