నవంబర్ రెండవ వారంలో హుస్నాబాద్ లో మెగా ఫారిన్ జాబ్ మేళా
నవంబరు రెండోవారంలో సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో మెగా ఫారిన్ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలోని తన ఛాంబర్లో టాంకాం ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. హుస్నాబాద్ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి స్కిల్స్ ఆధారంగా వివిధ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగావకాశాలు కల్పించేలా మేళాను ఏర్పాటు చేస్తున్నామన్నారు.