సంగారెడ్డి: రిజర్వేషన్ల దామాషాను నిర్ణయించే విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ
స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషాను నిర్ణయించే విషయంలో ఈ నెల 30 న సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో వెనుకబడిన తరగతుల కమిషన్ బృందం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. జిల్లాలోని రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజలు హాజరై తమ అభిప్రాయాలను కమిషన్ బృంద సభ్యులకు అందజేయాలని సూచించారు.