సిద్ధిపేట జిల్లా దుద్దెడ శివారు హరిత మినర్వా హోటల్ వద్ద రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొగ్తు, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ ఫ్యాక్టరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ లను బుధవారం కలెక్టర్ మనుచౌదరి వేరువేరుగా మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో వివిధ శాఖల పని తీరును కలెక్టర్ ను అడిగి తెలుసుకుంటూ మెరుగైన పాలన అందేలా కృషి చేయాలన్నారు.