దుబ్బాక: ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు
పుల్లూరు స్వయం భూలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గత 20 సంవత్సరాలుగా సిద్దిపేట మండలం పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం పుల్లూరు బండ క్షేత్రంలో సామూహిక వ్రతాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సుమారు 100 జంటలకు పైగా భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాల్లో కూర్చొని భాగస్వాములయ్యారు.