ఐపీఎల్ వేలంలో భారత పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు భారీ షాక్ తగిలింది. అతడి కోసం ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమన్, అఫ్గాన్ ఆల్‌రౌండర్ నవీనుల్ హక్ కూడా అన్‌సోల్డ్‌గా మిగిలారు. భారత వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మను అతడి కనీస ధర రూ.75 లక్షలకు గుజరాత్ సొంతం చేసుకుంది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను రూ.2.80 కోట్లకు కోల్‌కతా కొనుగోలు చేసింది.