ముదురు ఎరుపురంగులోకి మారి బాగా పండిన టమోటా పండ్లు విత్తనోత్పత్తికి అనువైనవి. పండ్లను పులియబెట్టే పద్ధతి రైతుకు సులభమైనది. 1 నుంచి 3 రోజుల వరకు టమోటాలను మట్టికుండలో పులియబెట్టిన తర్వాత విత్తనాన్ని సేకరించుకోవాలి. ఆ తర్వాత 8-10 సార్లు నీటిలో శుభ్రం పరచుకోవాలి. ఎటువంటి గుజ్జు విత్తనానికి అంటకుండా శుభ్రం చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ పద్ధతిలో ఎకరాకు 44-56 కిలోల విత్తనం పొందవచ్చు.