సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల కళాశాల బాలుర వసతి గృహాన్ని బుధవారం సాయంత్రం ఆర్డీఓ ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. కళాశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని ఆర్డీఓ వసతి గృహం అధికారికి, సిబ్బందికి సూచించారు.