జిల్లాలో గంజాయి సాగు, రవాణాపై ఉక్కు పాదం మోపాలని ఎస్పి రుపేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని చెప్పారు. పాత నేరస్తులు గంజాయి శిల్పాలు చేస్తూ పట్టుబడితే పిడికి యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.