కంది మండలంకు చెందిన 29 మందికి 8. 52 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంగళవారం క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మాజీ జడ్పిటిసి కొండల్ రెడ్డి, సి డి సి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.