జోగిపేట పట్టణంలో బుధవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మల్లన్న కాలనీ, బృందావన్ కాలనీలో కొత్త విద్యుత్ నియంత్రికను ఏర్పాటు చేస్తున్నందున విద్యుత్ కోత ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.