నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి కి ఇటీవల వారి వ్యవసాయ క్షేత్రంలో తేనెటీగల దాడి జరిగింది. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తెలుసుకొని మంగళవారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.