విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అధికారి సర్దార్ సింగ్ అన్నారు. పెద్ద శంకరంపేటలోని కస్తూర్బా, గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా బుధవారం పరిశీలించారు. భోజనంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపిడివో రఫిక్ ఉన్నిసా పాల్గొన్నారు.