అల్లాదుర్గం నుంచి మెటల్ కుంట రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని కోరుతూ రాయికోడు మండలం రహదారిపై గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. రహదారిపై ముళ్లకంచెలు వాహనాలు అడ్డుపెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.