సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలంలో డిసెంబరు ఒకటో తేదీన జరిగే మాలల సింహగర్జనను జయప్రదం చేయాలని మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ ఆకాష్ సోమవారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ అధ్యక్షులు దిలీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి ధనరాజ్ వడ్డీ, మాజీ సర్పంచ్ రవికుమార్ రాములు, చరణ్, తదితరులు పాల్గొన్నారు.