మల్టీజోన్- 2 ఐజీ సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లాలో పోలీస్ అధికారుల బదిలీలు జరిగినట్లు గురువారం ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. తాండూర్, కరణ్‌కోట్ సీఐలు సంతోష్ కుమార్, అశోక్ కుమార్ ఇరువురు ఐజీ ఆఫీసుకు, పెద్దేముల్ ఎస్సై గిరి, యాలాల ఎస్సై శంకర్‌ను ఎస్పీ ఆఫీసుకు అటాచ్డ్ చేస్తూ ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారని ఎస్పీ తెలిపారు.