ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్ట్ చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని శాంతి భద్రతల చర్యల నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.