పరిగి: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని KGBV పాఠశాలలో శనివారం మండల తహశీల్దార్ తిరుపతయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన పోషక ఆహారాన్ని అందించాలని చెప్పారు. కిచెన్ స్టోర్‌లోని ఆహార పదార్థాలను సామాగ్రిని వండిన ఆహారాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని పాఠశాల SO లక్ష్మీబాయికి సూచించారు. ఈ కార్యక్రమంలో MPO నరేందర్ రెడ్డి, MEO రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.