రంగారెడ్డి జిల్లాలోని రైన్ బో ఆసుపత్రిలో టేకుమట్ల మండలం రాఘవపురం గ్రామానికి చెందిన దండ్రే రమేష్ కూతురు మహాలక్ష్మి లివర్ సమస్యతో భాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి వారి వైద్య ఖర్చుల కొరకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు.