చెట్లకొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా సోమవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సరూర్ నగర్ డివిజినల్ ఇంజినీర్ కే. రామకృష్ణ తెలిపారు. 11కేవీ హుడాసాయినగర్, సౌత్అండ్ పార్క్ ఫీడర్ల పరిధిలోని కాలనీలలో ఉదయం 10. 30 నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు. 11కేవీ దుర్గానగర్ ఫీడర్ పరిధిలోని కాలనీలలో ఉదయం 10. 30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ ఉండదన్నారు.