ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ ప్రక్షాళనకు రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కేఎల్లార్ అన్నారు. సోమవారం తుక్కుగూడా మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశంలో నమూమీ గంగే మిషన్ తో గంగానదిలో మురికి క్లీన్ చేస్తున్న బీజేపీ, తెలంగాణలో మాత్రం మూసీ పునర్జీవాన్ని వ్యతిరేకించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.