ఎల్బీనగర్: పనుల్లో నిర్లక్ష్యం వద్దు

82பார்த்தது
ఎల్బీనగర్: పనుల్లో నిర్లక్ష్యం వద్దు
పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని హైకోర్టు కాలనీలో పారిశుద్ధ్య కార్మికులు పనులు సరిగా చేయడం లేదని ఫిర్యాదు మేరకు గురువారం ఆయన కాలనీలో పర్యటించి పనులను పర్యవేక్షించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ జవాన్ యాదయ్య, సూపర్వైజర్ శ్రవణ్ పాల్గొన్నారు.