జగిత్యాల: అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
జిల్లా ప్రజా పరిషత్ కింద మంజూరైన అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జెడ్పీ కింద మంజూరైన పనులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓ లు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.