లావోస్ దేశంలో డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇప్పిస్తానని జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు యువకుల నుండి డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధితులు గురువారం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన మోహన్, రాయికల్ మండలం అల్లీపూర్ కు చెందిన ప్రవీణ్ కుమార్, మరో ఇద్దరు యువకులు వంశీ అనే ఏజెంట్ ఒక్కొక్కరి వద్ద రూ 2 లక్షలు వసూలు చేసి లావోస్ కు పంపాడని తెలిపారు.