నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏఐడీఆర్ఎం రెండవ జాతీయ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు కమలాపురం రాజన్న మాట్లాడుతూ జనవరి 5, 6, 7 తేదీల్లో జరిగే జాతీయ మహాసభలను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు పీ నర్సింగరావు, ఎం నరేష్, ఎస్ శ్రీనివాస్, కుషాల్ పాల్గొన్నారు.