చందూర్ మండల కేంద్రంతో పాటు లక్ష్మాపూర్, మేడ్ పల్లి, కారేగాం, ఘనపూర్ గ్రామాల్లో కోతకొచ్చిన వరి పంటను రైతులు కోత కోసి కల్లాల్లో అమ్మకానికి ఉంచగా అకాల వర్షం కురవడంతో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్ట పోయిన ధాన్యానికి ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.