బోధన్ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఆరు గాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కుప్పలు రోడ్డుపై ఆరపోసి ప్రమాదాలకు కారణం కాకూడదని ఆదివారం బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరు రోడ్డుపై ధాన్యం ఆరబోయరాదని హెచ్చరించారు. వాహన దారులు కొన్ని సందర్భాల్లో చూసుకోకుండా ధాన్యం కుప్పలను ఢీకొని ప్రమాదాల బారిన పడే ఆస్కారం ఉందన్నారు.