శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న మహారాష్ట్ర ధర్మబాద్ శివారులో గల బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ సభ్యులు మంగళవారం మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అక్టోబర్ 29న బాబ్లీ గేట్లను మూసివేయాల్సి ఉండగా త్రిసభ్య కమిటీ సభ్యులు మూసివేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ శ్రీనివాసరావు, నాందేడ్ ఈ ఈ బన్ సోడ్, ఇరిగేషన్ అధికారులు వెంకటేశ్వర్లు, చక్రపాణిలు ఉన్నారు.