హైదరాబాద్లో జరుగబోయే మాలల సింహా గర్జన సభను మండలంలోని అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో మాలలు హాజరై సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం కుంటాల మండలం ఓలా గ్రామంలో సింహా గర్జన పోస్టర్ విడుదల చేసి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు మగ్గిడి దిగంబర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.