తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ-గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బుధవారం మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ముధోల్ నియోజకవర్గంలో ఉన్న హౌసింగ్ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని అలాగే భైంసాలో నిర్మించిన 660 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తియినవి, వాటిలో ఫ్లోరింగ్ పని, నీటి- విధ్యుత్ సరఫరా, ఇతర అవసరాలు పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.