భైంసా మార్కెట్ లో తగ్గిన పత్తి ధర

60பார்த்தது
భైంసా మార్కెట్లో పత్తి కొనుగోలు సజావుగా కొనసాగుతున్నాయి. గురువారం ప్రైవేటు పత్తి ధర రూ. 6, 850, సీసీఐలో పత్తి ధర రూ. 7, 521 ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ప్రైవేటులో రూ. 50 తగ్గింది. సీసీఐలో ధరలలో ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకు ధర తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర రూ. 10 వేలు చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி