ఆర్జీయూకేటీ బాసర స్టూడెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, నిర్మల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, అడిషనల్ కలెక్టర్ పైజాన్ అహ్మద్ పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, సమస్యలు పరిష్కరించడానికి అధికారులుగా అండగా ఉంటామని తెలిపారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలిపారు.