బాసర: అమ్మవారి ఆలయానికి రూ. 11 లక్షల విరాళం

61பார்த்தது
బాసర: అమ్మవారి ఆలయానికి రూ. 11 లక్షల విరాళం
బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన దాత విజయసరస్వతీదాసు మంగళవారం రూ. 11 లక్షల చెక్కును ఆలయ ఇన్ఛార్జి ఈఓ విజయరామారావుకు అందజేశారు. గతంలో ఆయన అమ్మవారికి బంగారు నెక్లెస్, వెండి పాత్రను అందజేశారని ఈఓ చెప్పారు. వసంత పంచమి, మూల నక్షత్ర వేడుకల సందర్భాల్లో చాలాసార్లు పూలతో ఆలయాన్ని అలంకరణ చేయించారని తెలిపారు. దాత అందజేసిన చెక్కును ఆలయ బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி