బ్రాహ్మణ వెళ్లేముల ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నార్కట్ పల్లి మండలం, బ్రాహ్మణ వెళ్లేముల వద్ద ఉన్న బ్రాహ్మణ వెళ్లేముల ఎత్తిపోతల పథకం సిస్టర్న్, కుడి, ఎడమ డిస్ట్రిబ్యూటరీ కాలువలను పరిశీలించారు. త్వరలో రేవంత్ రెడ్డి బ్రాహ్మణ వెళ్లేముల ప్రాజెక్టు ప్రారంభానికి రానున్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకం పరిసరాలను పరిశీలించారు.