ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 32 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.